దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం ఊగిసలాట

 


దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.28 సమయంలో సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 49,863 వద్ద నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 14,985 వద్ద ఉన్నాయి. తొలుత 150 పాయింట్ల లాభంతో మొదలైన సూచీలు ఆ తర్వత నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకొన్నాయి. ఆటోమోటీవ్‌ యాక్సిల్‌, నేషనల్‌ ఫర్టిలైజర్స్‌, రాష్ట్రీయ కెమికల్స్‌, ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. గోదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌, క్లారెంట్‌ కెమికల్స్‌, జిందాల్‌ పవర్‌ అండ్‌స్టీల్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎస్‌అండీపీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఫ్లాటుగా ఉన్నాయి.

నేడు మొత్తం 32 కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బాష్‌, హవెల్స్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌, బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌, టొరెంట్‌ పవర్‌ కంపెనీలు ఈ జాబితాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయ విలువ 17పైసలు బలపడి రూ.73.09గా ఉంది. ఎంసీఎక్స్‌ పదిగ్రాముల బంగారం ధర రూ.319 పెరిగి రూ.48,626 వద్ద, వెండి కిలో ధర రూ.897 తగ్గి రూ.72,299 వద్ద ఉన్నాయి.