భారత్‌లో ప్రైమ్‌ డే సేల్‌ను వాయిదా

 


 భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వ్యాపార రంగాలపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా విలాస వస్తువలుపై కాకుండా కేవలం ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమేజన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమేజాన్ ఇటీవల 'ప్రైమ్ డే సేల్' పేరిట ఓ భారీ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతీ ఏటా నిర్వహించనున్న ఈ సేల్‌లో భాగంగా ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో... భారత్‌లో ప్రైమ్‌ డే సేల్‌ను వాయిదా వేసింది. గతేడాది కూడా కరోనా విలయతాండవం చేయండంతో అమేజన్ ఈ సేల్‌ను ఆగస్టులో నిర్వహించింది.