యాస్ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్‌కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భువనేశ్వర్‌లోని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ధామ్రాకు 40 కిలోమీటర్లు, దిఘాకు 90 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో బుధవారం ఉదయం నుంచి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఒడిశాలోని తీర ప్రాంతాల్లో ప్రజలు పరిపాలనకు సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.