పూర్తైన వరంగల్, ఖమ్మం మేయర్ల ఎన్నిక..గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారుగ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికే ఖమ్మం మేయర్ పదవి దక్కింది. 26వ డివిజన్ నుంచి గెలిచిన పునుకొల్లు నీరజ ఖమ్మం మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి దక్కగా.. ఖమ్మం 38వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలిచిన ఫాతిమా పేరును అధిష్టానం ఖరారు చేసింది.

వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరిగింది.. అధిష్టానం కూడా ఆమె పేరే ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పదవికి రిజ్వాన షమీకి దక్కింది.