అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నెత్తుటేళ్లు

 


గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, అమెజాన్.. ఒకటేమిటి.. దాదాపు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలన్నిటీకీ పుట్టినిల్లయిన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నెత్తుటేళ్లు పారాయి. ప్రపంచ టెక్ హబ్ అయిన శాన్ జోస్ నగరంలో ఓ సాయుధుడు తన తోటి ఉద్యోగులను కిరాతకంగా హతమార్చాడు. అమెరికా సామూహిక కాల్పుల పరంపరలో తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న అతిపెద్ద ఉదంతం ఇదే కావడం విషాదకరం. వివరాలివి..


కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉంటోండటం తెలిసిందే. ఇక్కడి శాన్ జోస్ సిటీలో వేలాది కంపెనీలు పనిచేస్తున్నాయి. సిటీ నడిబొడ్డున ఉండే లైట్ రైల్వే యార్డులో తాజా కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యా ర్డులో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30కు ఈ ఉదంతం జరిగింది..