భారత్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులపై తాజాగా గల్ఫ్ దేశం కువైట్ కీలక ప్రకటన చేసింది. భారత్ సహా పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు కేవలం అవుట్‌బౌండ్ విమానాలు మాత్రమే నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐదు దేశాల నుంచి నేరుగా కువైట్‌కు విమాన సర్వీసులపై ఉన్న నిషేధం అలాగే కొనసాగుతుంది. అలాగే దేశంలో ప్రవాసుల ప్రవేశంపై నిషేధం ఇప్పటికీ అమలులో ఉంది. అయితే, ఈ ఐదు దేశాలకు, కువైట్ మధ్య కార్గో విమాన సర్వీసులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా భారత్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ను కువైట్ హైరిస్క్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ దేశాల నుంచి వచ్చే డైరెక్ట్ విమాన సర్వీసులపై కువైట్ బ్యాన్ వేసింది. అలాగే ఈ దేశాల పౌరుల రాకపై కూడా నిషేధం విధించింది.