. రామ్‌చరణ్‌ సరసన హిందీ నటి అలియాభట్‌

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రావడంతో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయట చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్‌ సరసన హిందీ నటి అలియాభట్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని తాజా సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. ప్రస్తుతం అలియా భట్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ సరసన సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్ రాగా తాజాగా అలియా అంటున్నారు. కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి మరో క్రేజీ వార్త ఏమంటే.. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు తాజాగా వినిపిస్తోన్న టాక్. త్వరలోనే శంకర్‌, రామ్‌చరణ్‌లు సల్మాన్‌ కలిసి ఆయన పాత్ర గురించి వివరిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభమౌతుందని, సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్‌ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.  ఈ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఒకటే టాక్ నడుస్తోంది. కాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడనేది టాక్. ఇక ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌తో పాటు కొరటాల శివ ఆచార్యలో నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో చరణ్ ఓ అరగంట పాటు కనిపిస్తాడట. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. కాజల్ చిరంజీవి సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే రామ్ చరన్ సరసన నటిస్తోంది.