ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు మరో ప్రధాన పాత్ర

 


ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్‌లో చిత్రబృందం. ఇంకా చిత్రీకరించాల్సిన భాగం చాలానే మిగిలి ఉందట. రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయాలని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడనున్నట్లు తాజా సమాచారం. దీనిపై కొంత క్లారిటీ రావాలసిఉంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.