ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా

 


ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక తేదీలను ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. కొవిడ్‌ కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.