కన్నడ స్టార్ యష్ కాంబినేషలో ఓ భారీ ప్రాజెక్ట్........డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్

 


డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవలే మాస్ మసాలా మూవీ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంతో చాలాకాలం తరువాత పూరీకి, రామ్ కు మంచి హిట్ లభించింది. ఇదే జోష్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి “లైగర్” అనే భారీ పాన్ ఇండియా మూవీకి తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ తరువాత పూరీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్, కన్నడ స్టార్ యష్ కాంబినేషలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ అని, బహు భాషా చిత్రమని సమాచారం. ఇటీవల పూరి జగన్నాథ్ పంపిన స్క్రిప్ట్ నచ్చడంతో యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. “లైగర్” చిత్రం షూటింగ్ పూర్తయ్యాక పూరి, యష్ కాంబినేషన్ లో ఈ భారీ పొలిటికల్ థ్రిల్లర్ రూపొందే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా “లైగర్”షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. “లైగర్” పూర్తయ్యాక పూరీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. మరోవైపు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “కెజిఎఫ్: చాప్టర్ -2” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.