న రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

 


కరోనా విపత్కర పరిస్థితుల్లో ధాన్యం పండించిన రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది.


ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది.


రైతులు టోల్‌ ఫ్రీ నంబర్లు : 1967, 180042500333లకు ఫిర్యాదు చేస్తే ఆయా ప్రాంతానికి చెందిన సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటారని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.