తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో డీఎంకే కూటమి ఘన విజయం

 


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో డీఎంకే కూటమి ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌కు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని అన్నారు. మీ నాయకత్వంలో మనం ఆ దిశగా అడుగు వేసి ప్రజల నమ్మకాన్ని నిరూపించగలం, శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు.