కృతీ శెట్టి... 'ఉప్పెన'తో కుర్రకారు దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. నిజానికి సినిమా రిలీజ్ అవడానికి ముందే ఆమె టాలీవుడ్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. సినిమా ప్రోమో, సాంగ్స్‌లో కృతీని చూసిన యువత ఆమె అందం, అభినయానికి మంత్రముగ్ధులయ్యారు. అటు దర్శకనిర్మాతలు కూడా ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా వుంటే ఆమె ప్రస్తుతం నాని 'శ్యామ్ సింగరాయ్'తో పాటు సుధీర్ భాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త చిత్రంలోనూ కృతిని హీరోయిన్గా ఎంచుకున్నారు. అయితే ఈ మూడు చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా బేబమ్మ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోలు ధనుష్, నితిన్, సూర్య, బెల్లంకొండ గణేష్ సినిమాలతో పాటు మరోసారి వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇదంతా వట్టి పుకార్లేనని తేల్చిపారేసింది కృతీ.