కెమెరా ముందుకు పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య

 


పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్యలను పబ్లిక్ లో పెద్దగా కనపడరు. తన తల్లి రేణు దేశాయ్ తో ఉంటున్న వాళ్లు తన చదువు, తమ ఆట,పాటలు లోకం అన్నట్లుగా ఉంటారు. అంతేకానీ పబ్లిక్ ఎప్పీరియన్స్ ని పెద్దగా కోరుకోరు. అప్పుడప్పుడూ అభిమానుల కోరిక మేరకు రేణు దేశాయ్ వారి ఫొటోలను షేర్ చేస్తూంటుంది సోషల్ మీడియాలో. అయితే ఊహించని విధంగా ఆద్య ..కెమెరా ముందుకు వచ్చింది. 


ఓ టీవి షో నిమిత్తం ఆమె మొదటి సారిగా కెమెరాని ఫేస్ చేసారు. ఆమె జీ తెలుగులో వస్తున్న  డ్రామా జూనియర్స్ టీవి షో లో  స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. రేణు దేశాయ్ ఆ షో జడ్జిలలో ఒకరు. ఈ మేరకు ఓ ప్రోమో కట్ చేసి వదిలారు. రేణు తన కుమార్తె ని షోలో చూసి సర్పైజ్ అవుతున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా ఆ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. మే 9 రాత్రి ఎనిమిది గంటలకు ఆ ఎపిసోడ్ ప్రసారం కానుంది.