బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా

 


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందజేసింది. తమ దేశంలో లాంగ్ టర్మ్ ఉండే వారికి యూఏఈ ఈ వీసా అందజేస్తుంది. దీంతో విదేశీయులు యూఏఈలో నివశించవచ్చు, పని చేసుకోవచ్చు. చదువుకోవచ్చు. ఇలా చేయడానికి గోల్డెన్ వీసా ఉన్న వారికి నేషనల్ స్పాన్సర్ అవసరం ఉండదు. 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి ఈ వీసాలు జారీ చేస్తారు. వీటి గడువు ముగియగానే ఆటోమేటిక్‌గా రిన్యూ అయిపోతాయి.


తనకు ఈ గోల్డెన్ వీసా లభించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సంజయ్ దత్.. జీడీఆర్ఎఫ్ఏదుబాయ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహమ్మద్ ఆల్ మార్రి ఆధ్వర్యంలో యూఏఈ గోల్డెన్ వీసా అందుకోవడాన్ని తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించాడు. యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫ్లైదుబాయ్ సీఓఓ హమద్ అబ్దుల్లా సహకారానికి ధన్యవాదాలు చెప్పాడు. ఈ గోల్డెన్ వీసా పొందిన తొలి భారత మెయిన్‌స్ట్రీమ్ నటుడు సంజయ్ దత్ కావడం గమనార్హం.