కార్గో విమానం విమానంలో మంటలు

 


ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన భారత వాయుసేన కార్గో విమానం విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన డోర్నియర్ 228 ట్విన్ టర్బోప్రాప్ విమానాన్ని కాన్పూరులోని హెచ్ఏఎల్ తయారు చేసింది. భారత వాయుసేనకు చెందిన రవాణ విమానం ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని ప్రధాన రన్ వే వద్ద దిగిన తర్వాత మంటలు చెలరేగాయి. విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఐఎఎఫ్ వెల్లడించింది.