ఆలిండియా లెవెల్లో అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి

 


ఎంత పెద్ద సూపర్ హిట్ తీసినా సరే, ప్రతీ దర్శకుడి జీవితాశయం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడమే. ఈ దిశగా ప్రయత్నం చేయని దర్శకుడే ఉండడు అంటే అది పెద్ద అతిశయోక్తిగా లెక్కపెట్టలేం. ఈ జాబితాలో ఇప్పుడు అర్జున్ రెడ్డి వంటి సెన్సేషనల్ హిట్‌ని రూపొందించిన యువదర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు గట్టిగా వినిపిస్తోంది. త్వరలో మెగాస్టార్ చిరంజీవికి వంగా కథ చెప్పబోతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. యువదర్శకుల ఆలోచనలను, ఊహలను ఎప్పటికప్పుడు ఆదరించే గుణమున్న మెగాస్టార్ కూడా సందీప్ కథ వినడానికి ఉత్సుకత చూపిస్తున్నారని నిర్మాతల వర్గంలో వినిపిస్తున్న మాట.


అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి పేరు ఆలిండియా లెవెల్లో మారుమోగిపోయింది. ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ కూడా అర్జున్ రెడ్డి సాధించిన విజయం ఆషామాషీ విజయం కాదు. మెగాస్టార్ కెరీర్ గనక చూస్తే ఈ విధంగా యంగ్ డైరెక్టర్స్‌కి వాళ్ళవాళ్ళ కథలలోని గొప్పదనం పరంగా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. పెద్ద డైరెక్టర్లు ఎదురుగా లైన్ఆప్ ఉన్నరోజులలోనే 'చూడాలని ఉంది' సినిమాతో గుణశేఖర్‌కి కథ మీద భరోసాతో ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. అదే విధంగా ఇప్పుడు సందీప్ రెడ్డి కథ కూడా చిరంజీవిని మురిపించగలిగితే గ్యారెంటీగా సినిమా ఉంటుందని చెప్పొచ్చు. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయని అంటున్నారు.