బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్

 


బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తుపాన్ దృష్ట్యా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహాపాత్ర ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్స్, ఐఎన్ఎస్ చిలికా, డీజీపీ, అగ్నిమాపక శాఖ డీజీలలో అత్యవసర సమావేశం నిర్వహించి సముద్ర తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యుత్ సరఫరా, గ్రామీణ, పట్టణ మంచినీటి సరఫరా, ఆరోగ్య, ఒడిశా విపత్తు ప్రతిస్పందన దళాలను సంసిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ప్రధాన కార్యదర్శి మహాపాత్ర చెప్పారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు తుపాన్ షెల్టర్లను సమాయత్తం చేశారు. రాబోయే తుపాన్ ను ఎదుర్కోవడానికి పరిపాలనా యంత్రాంగం సిద్ధంగా ఉందని చీఫ్ సెక్రటరీ మహాపాత్ర చెప్పారు. తుపాన్ విపత్తు దృష్ట్యా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను హెచ్చరికలు జారీ చేసి తిరిగి ఒడ్డుకు రావాలని కోరారు. తుపాన్ నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్, రెండు విమానాలు, ఓడలు పెట్రోలింగ్ చేస్తున్నాయని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ జెనా చెప్పారు.