భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది

 
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ఈ జాబితాలో సూడాన్ చేరింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై సూడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రెండు వారాలపాటు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికాలో అత్యధిక కేసులు నమోదవుతున్న ఈజిప్ట్‌, ఇథియోపియా దేశాల ప్రయాణికులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపివారి. వారందరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది.


వైద్యరంగంలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే సూడాన్ కరోనా వల్ల ఇప్పటికే సతమతమవుతున్నది. ఈనేపథ్యంలో దేశంలోని స్కూళ్లు, యూనివర్సిటీలను మూసివేసింది. ప్రార్థనలతోపాటు బహిరంగంగా గుమికూడకూడదని ఆదేశాలు జారీచేసింది. దేశంలో ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా బారినపడ్డారు.