అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్‌గా CHALO DIRECTOR

 


.ఎవరైన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్‌గా మారతారు. కాని ఛలో చిత్రంతో మంచి హిట్ కొట్టి రీసెంట్‌గా భీష్మ అనే చిత్రంతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా మారబోతున్నాడట. తన గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. వివరాలలోకి వెళితే ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబు 28వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు.


ఇటీవల త్రివిక్రమ్‌ దగ్గర సీనియర్‌ కో-డైరెక్టర్‌గా చేస్తూ వచ్చిన సత్యం కరోనాతో కన్ను మూసారు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌కు స్క్రిప్ట్ విషయంలో సాయంగా ఉండమని నిర్మాత రాధాకృష్ణ.. వెంకీ కుడుములని కోరాడట. దీనికి వెంకీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ప్రస్తుతం వెంకీ ఎలాంటి సినిమాకు కమిట్ కాకపోవడం, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమాలు చేసే ఛాన్స్ కూడా లేకపోవడంతో త్రివిక్రమ్‌తో కలిసి స్క్రిప్ట్ పరమైన చర్చల్లో పాల్గొంటాడట..