ఏప్రిల్ నెలలో వాహనాల సేల్స్ భారీగా down

 


ఏప్రిల్ నెలలో వాహనాల సేల్స్ భారీగా క్షీణించాయి. టాటా మోటార్స్ డొమెస్టిక్ వెహికిల్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 41 శాతం క్షీణించగా, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 9.5 శాతం తగ్గాయి. మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 11 శాతం పడిపోయాయి. మార్చి నెలలో టాటా మోటార్స్ 66,609 వాహనాలను విక్రయించినట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపిందది. ఏప్రిల్ నెలలో ఈ సేల్స్ 40.6 శాతం తగ్గి 41,739కి పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 70,263 సేల్ అయ్యాయి. ఇందులో కమర్షియల్ వాహనాల ఎగుమతులు 40 శాతం తగ్గి 2,209కి పరిమితమయ్యాయి.


మారుతీ సుజుకీ విక్రయాలు ఏప్రిల్ నెలలో నాలుగు శాతం తగ్గి 1,59,691 యూనిట్లకు క్షీణించాయి. మార్చినెలలో 1,67,014 కార్లని విక్రయించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాహన సరఫరాకి ఇబ్బందులు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. 2020 ఏప్రిల్ నెలలో కఠిన లాక్‌డౌన్ కారణంగా మారుతి ఒక్క కారునూ విక్రయించలేదు. రెండో అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుండాయ్ మార్చ్ విక్రయాలు 8 శాతం తగ్గి 64,621 యూనిట్ల నుండి 59,203కు తగ్గాయి.


మహీంద్రా అండ్ మహీంద్రా(M&M) మొత్తం వాహనాల సేల్స్ ఏప్రిల్ నెలలో 10 శాతం తగ్గి 36,437 యూనిట్లకు పరిమితమయ్యాయి. మార్చి సేల్స్ 40,403 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కియా హోల్‌సేల్ విక్రయాలు 16 శాతం క్షీణించి 16,111 యూనిట్లకు పరిమితమయ్యాయి. మార్చిలో 19,100 కార్లు విక్రయించింది. హోండా కార్ప్ సేల్స్ మాత్రం 28 శాతం పెరిగి 9,072 యూనిట్లుగా ఉన్నాయి.