సల్లూభాయ్‌తో కలిసి సీటీమార్ రీమిక్స్ song : దేవీ శ్రీ ప్రసాద్‌

 


ఈ ఏడాది ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్‌ను ఆడియెన్స్ కు అందించాడు దేవీ శ్రీ ప్రసాద్‌. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే డీఎస్పీ బాలీవుడ్ ప్రాజెక్టుకు పనిచేసే అవకాశాన్ని కొట్టిసినట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న సర్కస్ సినిమాకు రెండు పాటలు కంపోజ్ చేసే ఛాన్స్ కొట్టేశాడు డీఎస్పీ. ఇప్పటికే సాంగ్స్ కంపోజిషన్ కూడా కంప్లీట్ చేశాడట. వీటిలో ఒకటి మాస్ బీట్ కాగా..మరొకటి మెలోడి పాటని టాక్‌.


ఇటీవలే సల్లూభాయ్‌తో కలిసి సీటీమార్ రీమిక్స్ సాంగ్ కు స్టెప్పులేయించాడు డీఎస్పీ. ఈ సారి యువ నటుడు రణ్ వీర్ సింగ్ తో డ్యాన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నాడు. రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. వరుణ్ శర్మ కీ రోల్ చేస్తున్నాడు.