. రావణుడి తమ్ముడు విభీషణుడి ప్రాతలో SUDEEP

 


యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుంది. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ రూమర్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ ఈ మూవీలో నటించబోతున్నారని సమాచారం. తనది పాజిటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. రావణుడి తమ్ముడు విభీషణుడి ప్రాతలో సదీప్‌ నటించబోతున్నాడని సమాచారం.  కాగా, గతంలో ‘బాహుబలి’లో ప్రభాస్‌తో కలిసి సుదీప్‌ నటిం‍చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈగ, సన్నాఫ్ సత్యనారాయణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యాడు. ఎక్కువగా నెగెటీవ్‌ రోల్స్‌లో కనిపించే సుదీప్‌.. ఆదిపురుష్‌లో మాత్రం చాలా పాజిటివ్‌ పాత్రలో కనిపించబోతున్నాడట.