తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్ గా నియమితులైన జనార్దన్ రెడ్డి

 


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్, సభ్యులను ఇటీవల ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు చైర్మన్ గా నియమితులైన జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని వెల్లడించారు. నియామకాల్లో ఏమాత్రం ఆలస్యానికి, అలస్యానికి చోటు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ న్యాయబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీఎస్పీఎస్సీని దేశంలోనే ఆదర్శ కమిషన్ గా తీర్చిదిద్దుతామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం గంటలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయున్నారు. ఇప్పటికే సభ్యులుగా నియమితులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణ కుమారి, ప్రభుత్వ టీచర్ సుమిత్ర ఆనందర్ తనోబాలు గురువారమే వీఆర్ఎస్ తీసుకున్నారు.