సుజల్‌పూర్ టౌన్‌లో (భోపాల్‌కు 100 కిలోమీటర్ల దూరం) గాంధీనగర్ పోలీసులు అరెస్టు

 


బెదరింపు కాలర్‌ను 34 ఏళ్ల వ్యక్తిగా గుర్తించి మంగళవారం రాత్రి సుజల్‌పూర్ టౌన్‌లో (భోపాల్‌కు 100 కిలోమీటర్ల దూరం) గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. బెదరింపు కాల్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. భోపాల్, ఇండోర్ విమానాశ్రయాలకు ఇటీవల కాలంలో బెదరింపు కాల్స్ పెరుగుతున్నాయి. మంగళవారం సైతం బెదరింపు కాల్స్ రావడంతో భోపాల్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అక్కడి నుంచి ముంబైకి సాయంత్రం వెళ్లాల్సిన విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే క్లియరెన్స్ ఇచ్చారు.