అసోం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం జూన్ 16వ తేదీ వరకు లాక్ డౌన్

 


అసోం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం జూన్ 16వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలను పొడిగించింది. మొదట జూన్ 5వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన సర్కారు దీన్ని మరో 10 రోజులకు పొడిగించింది. కర్ఫ్యూ సమయాన్ని ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తగ్గించినట్లు అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రజల రాకపోకలపై నిషేధం విధించారు. జూన్ 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించారు.


ఇక తమిళనాడులో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 22 వేల కేసులు వెలుగుచూశాయి. 466 మంది ప్రాణాలు కోల్పోయారు. 33,646 మంది డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ కేసులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.