మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.20 లక్షలు

 


మీరు పాలసీ తీసుకోవాలని ఆలోచిస్తు్న్నారా? దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అయితే బెటర్ అని భావిస్తున్నారా? అయితే మీకు ఎల్ఐసీ పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటుంది. ఆర్థిక భద్రత, సేవింగ్స్ అనే రెండు రకాల ప్రయోజనాలు ఈ పాలసీ ద్వారా పొందొచ్చు. పాలసీదారుడు మరణిస్తే.. పాలసీ డబ్బులు నామినీకి చెందుతాయి. అదే పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ డబ్బులు వీరికే చెల్లిస్తారు. అందువల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి. 16 ఏళ్లు లేదా 21 ఏళ్లు లేదా 25 ఏళ్ల కాల పరిమితితో మీరు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. 16 ఏళ్ల ఆప్షన్ ఎంచుకుంటే 10 ఏళ్లు ప్రీమియం కట్టాలి. అదే 21 ఏళ్లు అయితే 15 ఏళ్లు, 25 ఏళ్లు అయితే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి 21 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకుంటే.. 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే..


రోజుకు రూ.150 ఆదా చేసి నెలకు దాదాపు రూ.4500 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.20 లక్షలు లభిస్తాయి. ఇందులో బీమా మొత్తం రూ.10 లక్షలు, బోనస్ రూ.10 లక్షలు, ఎఫ్ఏబీ రూ.లక్ష కలిసి ఉంటాయి. 8 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు. మీరు ఈ పాలసీ తీసుకోవడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇంకా పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత లోన్ సదుపాయం కూడా పొందొచ్చు.