ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా విరామం దొరకడంతో మళ్ళీ స్పూఫ్

 


ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా విరామం దొరకడంతో మళ్ళీ స్పూఫ్ వీడియోలను ప్రారంభించాడు డేవిడ్ వార్నర్. మొదటి లాక్ డౌన్ సమయంలో వీటితో రెచ్చిపోయిన వార్నర్. మళ్ళీ మ్యాచ్ లు ప్రారంభం కావడంతో వీటికి ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం చేసిన వీడియోలో ఆలియా భట్ తో స్టెప్పులు వేసాడు వార్నర్. టైగర్‌ ష్రాప్‌ నటించిన స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన స్పూఫ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభోమానులతో పంచుకున్నాడు. అయితే ‘ఇది నా అభిమానుల డిమాండ్‌ మేరకే’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.