2023లో టీఆర్‌ఎస్ పార్టీని సమాధి చేస్తామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శపథం

 


2023లో టీఆర్‌ఎస్ పార్టీని సమాధి చేస్తామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శపథం చేశారు. అమరుల కుటుంబాలను న్యాయం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై పోరాటానికి అన్నివర్గాలు, ఉద్యమకారులు బీజేపీతో కలసి రావాలని పిలుపునిచ్చారు.అమరవీరుల త్యాగల ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ, సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటులో కేసీఆర్ లేడన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, ఎమ్‌ఐఎమ్ కోసమే తెలంగాణ తెచ్చుకున్నారన్న చర్చ మేధావుల్లో జరుగుతుందని తెలిపారు. తన పరిపాలనపై కేసీఆర్ గుండె మీద చెయ్యి చేయి వేసుకొని ఆలోచించుకోవాలని హితవుపలికారు. గతంలో ఇచ్చిన హామీలేంటి... ఇప్పుడేమి జరుగుతోందో కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుకుంటానన్న కేసీఆర్ ఇప్పుడేమి సమాధానం చెప్తాడని బండిసంజయ్ ప్రశ్నించారు.