పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి జూన్ 30 వరకే గడువు

 


మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదంటే పాన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జూన్ నెల చివరి లోపు మీరు కచ్చితంగా కొన్ని అంశాలను పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి జూన్ 30 వరకే గడువు ఉంది. అంటే ఈ నెల దాటితే ఇక మీరు రెండింటినీ లింక్ చేసుకోలేరు. మీరు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాగే రూ.1000 పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్యాంకులు సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక స్కీమ్స్ రూపంలో అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI దగ్గరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తున్నాయి. ఇవి ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉంటాయి. చేరాలనుకునే వారు వెంటనే చేరండి. సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కస్టమర్లు ఒక విషయం తెలుసుకోవాలి. సిండికేట్ బ్యాంక్ కెనరాలో విలీనం అయ్యింది.


అందువల్ల ఈ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు జూలై 1 నుంచి పని చేయవు. అలాగే చెక్ బుక్స కూడా చెల్లుబాటు కావు. అందువల్ల మీరు సిండికేట్ బ్యాంక్ కస్టమర్ అయితే వెంటనే చెక్ బుక్ మార్చుకోండి. కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ పొందండి.