ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల

 


ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.ఐక్యూ జెడ్‌3 5జీ( iQoo Z3 5G ) పేరుతో ఫోన్‌ను మార్కెట్లోకి మంగళవారం ఆవిష్కరించింది. కొనుగోలుదారులు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, వారు అమెజాన్ కూపన్లలో 1,000 రూపాయలు కూడా పొందవచ్చు.


ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1,500 డిస్కౌంట్‌ లభించనుంది. ఆమెజాన్‌ కూపన్లతో మరో 1000 తగ్గింపు కూడా పొందొచ్చు. అమెజాన్‌.ఇన్‌ ద్వారా జూన్‌ 8వ తేదీ నుంచి ఫోన్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కొత్త ఫోన్‌లో 7nm స్నాప్‌డ్రాగన్ 768G చిప్‌సెట్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో వస్తున్న మొట్టమొదటి ఫోన్‌ ఇదే. ఈ ఫోన్‌లో 4,400 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 19 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.


iQoo Z3 ధరలు ఇవే:

6 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ : Rs 19,990

8 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌: Rs 20,990

8 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌: Rs 22,990


ఐక్యూ జెడ్‌3 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.58 అంగుళాలు

ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 768జీ

ఫ్రంట్‌ కెమెరా: 16 మెగా పిక్సెల్‌

రియర్‌ కెమెరా: 64+8+2 మెగా పిక్సెల్‌

ర్యామ్‌: 6జీబీ

స్టొరేజ్‌: 128జీబీ

బ్యాటరీ కెపాసిటీ: 4400mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 11