డిమాండ్ నేపథ్యంలో రెండో విడుతలో మరో 50 బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం బావిస్తుంది

 


ఆర్టీసీని ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్ధ అభివృద్ధికి చాలా మార్గాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆర్టీసీని ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2017-18 బడ్జెట్లో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.994 కోట్లు కేటాయించింది. సబ్సిడీల కోసమే రూ.520 కోట్లు కేటాయించింది. 2016-17 కేటాయింపులతో పోల్చితే 2017-18 బడ్జెట్లో రూ.511.17 కోట్లు అదనంగా కేటాయించారు. అలాగే, 2018-19 బడ్జెట్లో రూ.975.55 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.630 కోట్లు, 2020-21లో రూ.1,000 కోట్లు కేటాయించారు. రూ.350 కోట్లతో కొత్తగా 1350 బస్సులు కొనుగోలు చేశారు. 2017 మే 4న 60 మినీ ఏసీ బస్సులు (వజ్ర), 50 మినీ బస్సులు (పల్లె వెలుగు) మరియు వంద శాతం బయోడీజిల్ తో నడిచే రెండు బస్సులను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మరో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.

మొదట 20 బస్సులను జేఎన్టియు నుంచి శంషాబాద్ వరకు, ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ వకరు మరో 20 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా వచ్చే ఫలితాలు, డిమాండ్ నేపథ్యంలో రెండో విడుతలో మరో 50 బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం బావిస్తుంది. ఈ మేరకు గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీతో ఆర్టీసీ ఒప్పందం చేసుకున్నది. మొత్తంగా అన్ని రకాల బస్సులు కలుపుకొని 2013-14 లో 10,406 బస్సులు నడువగా, 2019-20 లో 9,691 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో జిల్లాల్లో 2015-16తో పోలిస్తే 2016-17 లో రూ.233 కోట్ల నష్టం తగ్గింది. మొత్తంగా 60 కోట్ల నష్టం తగ్గింది.

ఇందనం పొదుపులో వరుసగా రెండో సారి దేశంలోనే స్థానాన్ని సంపాదించుకుంది టీఎస్ఆర్టీసీ. ప్రతీ లీటరుకు 5.45 కి.మీ. మైలేజి సాదిస్తున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ ఇవ్వని విధంగా.. ఆర్టీసీ సంస్థ ఏటా ఉద్యోగుల జీతాల కోసం 52శాతం ఆదాయాన్ని అంటే సుమారుగా రూ.2400 కోట్లు ఖర్చు చేస్తున్నది. దీంతో సంస్థకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నందున ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు వల్ల పడిన ఆర్ధిక భారం రూ.750 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. 2013-14 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.121.95 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2019-20 లో టిఆర్ఎస్ ప్రభుత్వం రూ.460 కోట్ల ఇచ్చింది. టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 98 లక్షల మందిని గమ్యానికి చేరుస్తుంది. సుమారుగా 10,500 బస్సులు నడుస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ లో : హైదరాబాద్ లో ఈ సంస్థ రూ.218 కోట్ల నష్టంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్ ట్రాన్స్ పోర్ట్ నష్టాల్లోనే ఉంటుందని, ఈ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ను అక్కడి ప్రభుత్వాలే నిర్వహిస్తుంటాయని గుర్తించిన ప్రభుత్వం మన రాష్ట్రంలోనూ అలాంటి విధానాన్నే అవలంభించాలని 2015 సెప్టెంబర్ 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీంతో ఇక టీఎస్ఆర్టీసీ నష్టాలను జీహెచ్ఎంసీ భరించనుంది. హైదరాబాద్ లో 3800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. వాటి నష్టాలను జీహెచ్ఎంసీ నిధుల నుంచి పూడ్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆర్టీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టరుగా నియమిస్తూ చట్ట సవరణ చేశారు. రూరల్ ఏరియాలో వచ్చే ఆదాయంలో అప్పులు కట్టనున్నారు. బస్టాండ్ల నిర్వహణ తదితర అంశాలపై కమిషనరే నిర్ణయం తీసుకుంటారు. టీఎస్ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి రూ.336 కోట్లు ఇప్పించారు.

ఆధునికత దిశగా ఆర్టీసీ

బస్సుల్లో జీపీఎస్, ప్యానిక్ బటన్ ను తప్పనిసరి చేశారు. ప్రమాదాల నివారణకు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 9691 బస్సుల్లో మొత్తం రోజుకు 98 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణం చేస్తున్నారు. సుమారుగా రోజుకు రూ.12 కోట్ల కలెక్షన్ వస్తుంది. ఇంత మంది ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట పైటెట్ ప్రాజెక్టుగా 400 బస్సులకు జీపీఎస్ పరికరాలను అమర్చి హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో అమలు చేస్తున్నారు.