ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప.

 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా పుష్ప ఇంట్రడక్షన్ వీడియో విడుదల కాగా, ఇది రికార్డులు తిరగరాస్తుంది.


పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియో తెలుగు ఇండస్ట్రీలో 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా చరిత్ర సృష్టించింది. ఇలాంటి రికార్డ్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరో సాధించలేదు.కేవలం టీజర్‌తోనే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. చిత్రంలో బబ్లీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.