టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా వివాదానికి స్వస్తి

 


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా వివాదానికి స్వస్తి పలికాడు. నెటిజన్లు తనపై వేస్తున్న సెటైర్లు, కామెంట్లకు ఒక్క పోస్టుతో బదులిచ్చాడు. తాను తినే ఆహారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశాడు. ఇక హాయిగా నిద్రపోవాలంటూ ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ స్పందించాడు.


గతంలో మాంసాహారం తింటూ ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్నానని చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్నేళ్ల కిందట శాఖాహారిగా మారిపోయానని తెలిపాడు. వెజిటేరియన్‌గా మారిన తరువాత తనలో చాలా మార్పులొచ్చాయని, ప్రశాంతంగా ఉంటున్నానని సైతం పలు సందర్భాలలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్రస్తావించాడు. క్వారంటైన్‌లో తాను కోడిగుడ్లు తింటున్నానని చెప్పడంతో భారత కెప్టెన్‌పై సెటైర్ల వర్షం మొదలైంది. నువ్వు వేగన్ అని చెప్పావు, కోడిగుడ్డు Vegan ఎప్పుడయ్యిందని కామెంట్లు చేశారు. వివాదం ముదురుతున్న నేపథ్యంలో కోహ్లీ విమర్శలకు, కామెంట్లకు చెక్ పెట్టాడు.