ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన

 


ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు సమాచారం. కొంతమంది కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన వైసీపీ ఎంపీలు రక్షణ, ఆర్థికశాఖ మంత్రుల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం, బెయిల్ రద్దు పిటిషన్ నేపథ్యంలో జగన్ హస్తిన పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

పలువురు ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లకు తనపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ రఘురామ ఇప్పటికే లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై, రాజద్రోహం సెక్షన్ ప్రయోగంపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కేంద్రమంత్రులను కలిసి ఏపీ ప్రభుత్వ వైఖరిని వివరించే యోచనలో ఉన్నారు. కాగా సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ చివరి నిముషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.