దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాహనాల డ్రైవర్లు జర జాగ్రత్తగా

 


దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాహనాల డ్రైవర్లు జర జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కేంద్రం కోరింది. ఢిల్లీలోని రోడ్లపై కారును గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వేగ పరిమితిని నిర్ణయించింది. ద్విచక్రవాహనాల వేగపరిమితిని గంటకు 30 కిలోమీటర్ల చొప్పున, బస్సులు, టెంపోలు, త్రీవీలర్ల గరిష్ఠ వేగపరిమితిని కూడా గంటకు 40 కిలోమీటర్ల చొప్పున పరిమితి విధించింది. ఈ మేర ఢిల్లీలో వాహనాల వేగపరిమితిపై ట్రాఫిక్ పోలీసులు అధికారికం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

ఢిల్లీ నంచి నోయిడా టోల్ రోడ్డు వరకు వేగపరిమితి కార్లకు గంటకు 70 కిలోమీటర్లు, ద్విచక్రవాహనాలకు గంటకు 60 కిలోమీటర్లు, రింగ్ రోడ్- ఆజాద్ పూర్ నుంచి చాంగ్డి రా చౌక్ వరకు కారు, బైక్ ల గరిష్ఠ వేగపరిమితి గంటకు 50 కిలోమీటర్లు, విమానాశ్రయం రహదారిలో గరిష్ఠ వేగపరిమితి గంటకు 60 కిలోమీటర్ల చొప్పున నిర్ణయించింది. గరిష్ఠ వేగపరిమితిని మించి వాహనాలు వేగంగా నడిపితే భారీ జరిమానాలు తప్పవని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.