వాయువ్య బంగాళాఖాతం శుక్రవారం అల్పపీడనం

 


వాయువ్య బంగాళాఖాతం శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ, ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు రాబోయే 24 గంటల్లో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌, బిహార్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని, ఇందుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది. అల్పపీడనానికి అనుబంధంగా పశ్చిమ గాలులు బలపడడంతో శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.