లాక్‌డౌన్‌తో విలవిలలాడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు

 


లాక్‌డౌన్‌తో విలవిలలాడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. పెరిగిన ధరలతో వి లవిలలా డుతున్న రాష్ట్ర ప్రజలపై కరెంట్‌ చార్జీల భారం పడనుంది. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలను కేంద్రం ఒక పక్క పెట్రోల్‌ డీజెల్‌ ధరల పెంపుతో షాక్‌లు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్‌ షాక్‌నిచ్చింది. ప్రతి యూనిట్‌కు సరాసరి 30 పైసలు చొప్పున విద్యుత్‌చార్జీని పెంచారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 10 పైసల మేరకు భారం పడనుంది. తొలి స్లాబ్‌ను 50 యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి అన్వయించారు. విద్యుత్‌ కంపెనీల నిర్వహణా భారాన్ని కొంతమేరకు త గ్గించేందుకు స్వల్పంగా చార్జీలను పెంచకతప్పడం లేదని ప్ర భుత్వ వర్గాలు వెల్లడించాయి. నగరాలు, పట్టణాల ప్రదేశంలో తొ లి 50 యూనిట్ల వరకు ప్రస్తుతం యూనిట్‌ విద్యుత్‌ చార్జీ 4 రూపాయలు కాగా ఇది రూ4.10కు పెరిగింది. 51-100 యూనిట్ల వరకు పాత చార్జీ రూ5.45గా ఉండగా ఇది రూ.5.55కు పెరుగనుంది. 101 నుంచి 200 యూనిట్ల వరకు ప్రస్తుత చార్జీ యూనిట్‌కు రూ 7గా ఉండగా కొత్త చార్జీ రూ 7.10 కానుంది. 200 యూనిట్లు ఆపై వాడకానికి పాత ధర ప్రతియూనిట్‌కు రూ 8.05గా ఉండగా కొత్త చార్జీ రూ 8.15 కానుంది. కాగా గ్రామాలలో వినియోగించే విద్యుత్‌ చార్జీలు కూడా స్వల్పంగా పెరిగాయి.


50 యూనిట్ల వరకు వాడకంపై ప్రతియూనిట్‌కు ప్రస్తుతం రూ 3.90 గా ఉంటే కొత్త చార్జీ రూ 4 కానుంది. 51 నుంచి 100 యూనిట్ల వరకు వాడకంపై ప్రతియూనిట్‌కు ప్రస్తుత ధర రూ.5.15 కాగా కొత్త ధర రూ 5.25 కానుంది. 101 నుంచి 200 యూనిట్ల వరకు వాడకంపై ప్రతియూనిట్‌కు ప్రస్తుత ధర రూ 6.70 కాగా కొత్త ధర రూ 6.80 కానుంది. ఇక 200 ఆపై యూనిట్ల వాడకంపై విద్యుత్‌ చార్జీ ప్రస్తుతం యూనిట్‌కు రూ 7.55 కాగా కొత్త చార్జీ రూ 7.65 కానుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా కరోనా సంక్షోభం వేళ ప్రజలపై విద్యుత్‌చార్జీల భారం మోపడం దారుణమని ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, జేడీఎస్ లు మండిపడ్డాయి. పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. అసలే కరోనాతో విల విలలాడుతున్న జనాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజలను మరింత అగాధంలోకి తోస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రో మంటలతో పాటు, రాష్ట్రం అధిక చార్జీలతో సామాన్యుడి జీవితాలను కుదేలు చేస్తున్నాయని అన్నారు.b