అఖిల్ నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో

 


అఖిల్ నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి స్క్రిప్టుని పక్కా గా రాసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని ఎంచుకునే అవకాశాలున్నట్టు టాక్‌. సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. అందులో ఉపేంద్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి. సురేందర్ రెడ్డి - అఖిల్ సినిమా పాన్ ఇండియా లెవిల్ లో తెరకెక్కుతోంది కాబట్టి, కన్నడ నుంచి ప్రతినాయకుడ్ని ఎంచుకుంటే బాగుంటుందని టీమ్ భావిస్తోంది. ఈ విషయమై ఉపేంద్రతో సంప్రదింపులు జరుపుతోంది టీమ్. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ రావొచ్చు.