సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయుడికి అక్కడి కోర్టు భారీగా ఫైన్

 


సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయుడికి అక్కడి కోర్టు భారీగా ఫైన్ విధించింది. అంతేకాకుండా ఆరు నెలలపాటు వాహనాలను నడపరాదంటూ ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన భాస్కర్ గత కొన్నేళ్లుగా సింగపూర్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 2019 ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తు ఓ మహిళను ఆయన గాయపరిచాడు. పార్కింగ్ స్థలం నుంచి కారును బయటకు తీస్తూ.. 58ఏళ్ల మహిళను కారుతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డారు. కాలిలోని ఎముక విరగడంతోపాటు వెన్నుముకకు బలంగా దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో స్పందించిన భాస్కర్ ఆమెను ఆసుపత్రికి తరలించాడు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెల్లడించింది. భాస్కర్‌కు 3వేల సింగపూర్ డాలర్ల ఫైన్ విధించడంతోపాటు అతని డ్రైవింగ్‌పై ఆరు నెలలపాటు బ్యాన్ విధించింది.