భారతీయ వెబ్ సిరీస్ లో నంబర్ వన్ స్థానం సంపాదించిన ఫ్యామిలీ మ్యాన్ మొదటి సిరీస్భారతీయ వెబ్ సిరీస్ లో నంబర్ వన్ స్థానం సంపాదించిన ఫ్యామిలీ మ్యాన్ మొదటి సిరీస్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఉత్సాహం తోనే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 కి శ్రీకారం చుట్టారు. అయితే ఈ సారి తమిళ ఈలం (ఎల్టీటీఈ) చుట్టూ కథని అల్లుకున్నారు. సమంత ఎల్టీటీఈ సభ్యురాలి పాత్రను పోషించింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ లో ఎల్టీటీఈ, పాకిస్థాన్ ఉగ్రవాదులు కలిసి పని చేసినట్లుగా చూపించడంపై తమిళనాడు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే లంకేయులతో కలిసి ఉండలేమని, తమకు వేరే రాజ్యం కావాలని పోరాడిన తమిళ టైగర్లను ఉగ్రవాదులుగా చూపించడమేంటని తమిళులు తమ నిరసనని వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ 'ఫ్యామిలీ మ్యాన్-2'ను నిషేధించాలంటూ డిమాండ్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వెళ్లిందంటే ఈ వివాదం ఎంతగా ముదిరిపోయిందో అర్ధం అవుతుంది. అయితే నిజానికి ఈ సిరీస్‌లో తమిళ టైగర్లను నెగెటివ్ కోణంలో ఏమీ చూపించలేదని ఫ్యామిలీ మ్యాన్ 2 చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. తమిళ ఈలం (ఎల్టీటీఈ) వారు పడ్డ బాధల్ని, కష్టాల్ని చర్చించే ప్రయత్నం ఈ సిరీస్ లో జరిగింది.


వారి కోణంలో కథను చెప్పే ప్రయత్నమూ జరిగింది. అయితే కథానుగుణంగా ఇందులో వాస్తవాల్ని వక్రీకరించారన్నది తెలుస్తోంది. అయితే తమిళ టైగర్ల పట్ల సానుభూతితో కథ సాగడం, ముఖ్యంగా సమంత పాత్ర ని చూపించిన విధానం తమిళులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా ఏమీ లేదని కొందరి అభిప్రాయం. తమిళ టైగర్లు ఎప్పుడూ కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పని చేయలేదని ఉగ్రవాదులతో కలిసి పని చేస్తే వీళ్లూ ఉగ్రవాదులే అవుతారు కానీ ఉద్యమ కారులు కారు కదా.. మరి అలా ఎలా చూపిస్తారు అని కొందరి వాదన్.. మరి ఈ వివాదం ఇటు దారితీస్తుందో చూడాలి.