లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' తిరిగి షూటింగ్

 


లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' తిరిగి షూటింగ్ మొదలవబోతోందని సోషల్ మీడియాలో వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ తమిళ నవల ఆధారంగా, పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఇందులో విక్రమ్‌, త్రిష, కార్తీ, జయం రవి, విక్రమ్‌ ప్రభు, శరత్‌ కుమార్‌, పార్తీపన్‌, ప్రభు, జయరాం, ప్రకాష్‌ రాజ్‌, రెహమాన్‌, అశ్వన్‌ కక్కుమన్ను, ఐశ్వర్యా రాయ్‌, శోభిత ధూళిపాల, అతిథిరావు హైదరీ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే 2019లో షూటింగ్ మొదలు పెట్టినప్పటికీ అంతరాయం కలుగుతూనే ఉంది.


ఇటీవలే చిత్రబృందం 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ అక్కడ కాన్సిల్ అయింది. తాజా సమాచారం ప్రకారం మళ్లీ మధ్యప్రదేశ్ లోని మండవ - మహేశ్వర్ ప్రాంతాలలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే జూన్ 15 నుండి స్టార్ట్ చేయనున్నారట. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.