అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు

 


 కరోనా కేసులు ఉధృతంగా వున్న సమయంలో అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు పట్టించుకోవడం లేదంటూ జపాన్‌ ఒలింపిక్‌ కమిటీ (జెఓసి) సభ్యుడొకరు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ముప్పును తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకోవాలని జపాన్‌ ఉన్నత వైద్య సలహాదారు సూచించారు. జపాన్‌లో మెజారిటీ ప్రజలు ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. ప్రజల ఆకాంక్షలను, అభిప్రాయాలను తోసిరాజని ముందుకు సాగాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసి) భావిస్తున్నట్లు కనిపిస్తోందని జెఓసి సభ్యుడు కయోరి యమాగుచి వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సినవే ఈ ఏడాది వాయిదా పడ్డాయి. ఇప్పుడు కూడా పరిస్థితిలో మార్పు లేదు, దాంతో క్రీడా కార్యక్రమాల స్థాయిని తగ్గించి నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. దేశంలో ఇప్పటికే నాల్గో దశ నడుస్తున్నందున, ఈ క్రీడలు నిర్వహిస్తే కేసులు మరింత వ్యాప్తి చెందే అవకాశం వుందని, వైద్య వనరులు కూడా హరించుకుపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌ ప్రభుత్వ ఉన్నత వైద్య సలహా    

దారు షింగెరు ఒమి శుక్రవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఇటువంటి కీలక తరుణంలో కొత్తగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప ఈ ముప్పును నివారించడం కష్టసాధ్యమని అన్నారు.