తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ

 


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఎక్కువగా అందరిదృష్టిలో పడిన కథానాయిక రియా చక్రవర్తి.తెలుగులో తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఈ క్రమంలో ఓ అరడజను సినిమాలు వరకు చేసింది.


ఇక సుశాంత్ ఆత్మహత్యపై విచారణలో డ్రగ్స్ వ్యాపారం కూడా వెలుగు చూసింది.దీంట్లో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.ఇక ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చింది.ఇది ఇలా ఉంటే మరల రియా చక్రవర్తి హీరోయిన్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది.ఆ సంఘటన నుంచి బయటపడడానికి అవకాశాల కోసం వెతుకుతుంది.ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో టాలీవుడ్ లో రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.రానా దగ్గుబాటి ఈ మూవీని నిర్మిస్తున్నట్లు సమాచారం.త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.