పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

 


చత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా ఓర్చ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమాగల్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఐదుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన మావోయిస్టులపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వారివద్ద నుండి మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.