మైసూరు మాజీ జిల్లా అధికారి రోహిణి సింధూరి తీవ్రమైన ఆరోపణ

 


: మైసూరు అభివృద్ధి ప్రాధికార (ముడా) అధ్యక్షుడు హెచ్‌పీ రాజీవ్‌, ఎమ్మెల్యే సా రా మహేశ్‌ భాగస్వామ్యంలో భూమాఫియా సాగిందని మైసూరు మాజీ జిల్లా అధికారి రోహిణి సింధూరి తీవ్రమైన ఆరోపణ చేశారు. బుధవారం ఆమె మైసూరులో మీడియాతో మాట్లాడారు. భూమాఫియే తనను బదిలీ చేయించిందన్నారు. తర్వాత కూడా తనపై ఆరోపణలు కొనసాగిస్తున్నారని, వీటన్నింటికీ సా రా మహేశ్‌యే కారణమన్నారు. మైసూరులో రాజకాలువపై సా రా చౌల్ట్రీ నిర్మించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలకై ప్రాధికారకు నోటీసులు ఇచ్చి సమాధానం అడిగానన్నారు. అదే కారణంతో సా రా మహేశ్‌ ఆరోపణలు చేస్తూ వచ్చారన్నారు. ముడా అధ్యక్షుడు రాజీవ్‌, సా రా మహేశ్‌ నేతృత్వంలో భూమాఫియా సాగుతోందని, క్రమబద్దీకరించే అధికారం జిల్లా అధికారి కి ఉంటుందన్నారు. ఈ ప్రయత్నం చేస్తాననే వారు కుట్ర పన్నారన్నారు. గవర్నర్‌కు తానెందుకు లేఖ రాస్తానని ప్రశ్నించారు. మైసూరులో ప్రైవేటు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో సా రా మహేశ్‌కు భాగం ఉందని, వారితో మైసూరు కమిషనర్‌గా వ్యవహరించిన శిల్పానాగ్‌ సహకరించారన్నారు.


అందుకే మైసూరులో ప్రభుత్వ కొవిడ్‌కేర్‌ సెంటర్‌ తెరవలేదన్నారు. అందరూ కుట్రపన్ని బదిలీ చేయించారన్నారు. సారా మహేశ్‌ తనను మోడల్‌ అంటూ వ్యక్తిగతంగా ఆరోపించారని, అయినా మౌనంగా ఉన్నానన్నారు.