పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా వర్సిటీలు, కళాశాలల్లో వేడుకలు

 


పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా వర్సిటీలు, కళాశాలల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ వేదికగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించాలని యూజీసీ సూచించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, కాలేజీల్లో పర్యవరణ దినోత్సవాన్ని నిర్వహించున్నారు.


ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 5న జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈమేరకు పర్యవరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా ఈరోజును జరుపుతున్నారు. 1973లో మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది RRR (Reimagine. Recreate. Restore.. పునరాలోచించు, పున:సృష్టించు, పునరుద్ధరించు) థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.