వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు

 


'వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగెత్తగలుగుతుందని నమ్మాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకు వచ్చాం. పాల సేకరణ ద్వారా అక్కచెల్లెమ్మలందరికీ మరింత ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. తద్వారా వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది' అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. జగనన్న పాల వెల్లువలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ-అమూల్‌ పాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆమూల్‌ పాల సేకరణను విస్తరించనున్నామని చెప్పారు. తద్వారా పాడి రైతులైన అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలోపేతం కానున్నారని పేర్కొన్నారు. 'పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఒక లీటరు పాలు తీసుకుని వచ్చి నాకు చూపించేవారు. ఒక లీటరు పాల రేటు రూ.23 ఉంది. ఒక లీటరు మినరల్‌ వాటర్‌ రేటు ఇంత కన్నా ఎక్కువుంది.. ఇదీ మా పరిస్థితి అని అక్కచెల్లెమ్మలు, పాడి రైతులు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలని, వ్యవసాయ ఆధారిత రంగాల ద్వారా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలని వెంటనే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకొచ్చాం' అన్నారు. అమూల్‌కు లాభాపేక్ష లేదని, లాభాలన్నీ ఏడాదికి ఒకసారి తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తూ గొప్ప పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..


అమూల్‌ దేశంలో నంబర్‌ వన్‌ సహకార సంస్థ