పాల ఉత్పత్తుల ఎగుమతుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాలపై వెబినార్ ఇంటరాక్టివ్ సెషన్‌

 


అపెడ మత్స్య, పశుసంవర్ధక,పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ (ఎంఎఫ్‌ఎహెచ్‌డి) సహకారంతో దేశం నుంచి పాల ఉత్పత్తుల ఎగుమతుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాలపై వెబినార్ ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించింది.


వెబ్‌నార్‌లో ఎంఎఫ్‌హెచ్‌డి కార్యదర్శి అతుల్ చతుర్వేది మాట్లాడుతూ ” పాల ఉత్పత్తిలో భారతదేశం ఆత్మనిర్భర్అని, ఎగుమతులకు తగినంత మిగులు ఉత్పత్తి ఉందని అన్నారు. పాల ఉత్పత్తులలో ఉత్పత్తి ,ఎగుమతి వృద్ధిలో సాధించిన పురోగతిని ఆయన వివరించారు.పాడి అభివృద్ధికి జాతీయ కార్యక్రమం,జాతీయ పశువుల మిషన్, పశువుల ఆరోగ్యం,వ్యాధుల నియంత్రణ,పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి వంటి పశుసంవర్ధక,పాడిపరిశ్రమ శాఖ పథకాలు,కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు