కళ్లెదుటే కొండచరియ విరిగిపడింది.

 


కళ్లెదుటే కొండచరియ విరిగిపడింది. ముందే పసిగట్టడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆర్మీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని తవాఘాట్ దగ్గర ధార్చూలాలో జరిగింది. ఆర్మీ వాహనాలు వెళ్లేందుకు ఈ కొండ మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. బుధవారం ఉదయం కొండల్లో ఏదో కదలిక కనిపించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేశారు. కొండచరియ విరిగి పడబోతోందని గ్రహించిన ఆర్మీ అధికారులు ఓపిగ్గా నిరీక్షించారు. అటు వెళ్లేందుకు ప్రయత్నించిన వాహనాలను విజిల్ వేసి మరీ ఆపారు. అంతలోనే రోడ్డువైపు ఉన్న కొండ భాగం కుప్పకూలింది. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఇలా కొండచరియలు విరిగిపడడం తరచూ జరుగుతుంటుంది. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరగడంతో పర్వతాల్లో కదలికలను ముందే గుర్తించగలుగుతున్నారు.